👉 ప్రజల్లో confusion.. గ్యాస్ కొరత భయం!
మీ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ అయిపోవచ్చిందా? వెంటనే బుక్ చేసేద్దాం అని అనుకుంటున్నారా? అయితే కొంచెం ఆగండి! మునుపటిలా ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు సిలిండర్ బుక్ చేయడం కుదరదు. మీరు ఐవీఆర్ఎస్ (IVRS) కాల్ చేసినా లేదా మొబైల్ యాప్ ద్వారా ట్రై చేసినా.. కొన్నిసార్లు బుకింగ్ రిజెక్ట్ అవుతుండటం మీరు గమనించే ఉంటారు. దీనికి కారణం మీ ఫోన్ పనిచేయకపోవడం కాదు, లేటెస్ట్‌గా ఆయిల్ కంపెనీలు అమలు చేసిన కఠినమైన నిబంధనలు. అవును, వంటగ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) సిలిండర్ బుకింగ్ గడువును సవరించాయి. మీరు సింగిల్ సిలిండర్ వాడుతున్నారా, డబుల్ కనెక్షనా లేదా ప్రధాని ఉజ్వల యోజన (PM Ujjwala) లబ్ధిదారులా? అన్న దానిపై ఈ కొత్త రూల్ ఆధారపడి ఉంది.
🔥 Highlights:
- 🔴 సిలిండర్ కొరత కారణంగా బుకింగ్ నియమాలు మరింత కఠినం.
⏳ సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలి.
🚫 డబుల్ సిలిండర్ ఉన్నవారు (సాధారణ) 35 రోజుల గడువు పాటించాలి.
⚠️ PM ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 45 రోజుల తర్వాతే బుకింగ్ అవకాశం.
💻 గడువు లోపు చేసే బుకింగ్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తున్న సిస్టమ్.
